ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మందికి సరిగ్గా ముప్పై ఏళ్ళు కూడా నిండకుండానే జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సమస్యకి హోమియోపతి తో శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారికి హోమియోపతితో పాటు వివిధ హోం రెమెడీస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. పోషకలోపం నుండి బయటపడటానికి పండ్లు, కూరగాయలు, పెరుగు, ఆమ్లా తీసుకోవడం చాలా మంచిది. హోమియోపతి మందుల వల్ల ఈ సమస్యని మనం సహజంగానే దూరం చేసుకోవచ్చు. మరి ఎలాగో చూద్దాం రండి....

తెల్లజుట్టు మరింత పెరగకుండా ఉండటానికి ఫాస్ఫరస్ అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు, తలపై దురదతో పాటు తెల్ల జుట్టుతో బాధపడేవారికి ఇది మంచిది. ఫాస్ఫరస్ తీసుకునే వ్యక్తులు శీతల పానీయాలు, రసం, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. జుట్టు తెల్ల రంగులోకి మారే ప్రక్రియను ఆపడానికి లైకోపోడియం చాలా సహజంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాధారణంగా మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ మందును సూచిస్తారు.అలాగే నాట్రమ్ ముర్ హోమియోపతి మందు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

మందుల వాడే వ్యక్తికి ఉప్పగా ఉండే ఆహార పదార్థాలపై అధిక కోరిక ఉంటుంది. ఆర్నికా హోమియో పతి హెయిర్ ఆయిల్  ఒక ఫ్లవరింగ్ హెర్బ్. దీనితో తయారు చేసిన హెయిర్ ఆయిల్ ను చర్మం, స్కాల్ప్ మరియు జుట్టు సమస్యలకు హోమియోపతి చికిత్సగా ఉపయోగిస్తారు. ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇంకా జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా వింకా మైనర్ పిగ్మెంటేషన్ మీద పనిచేస్తుంది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తెల్ల జుట్టును తగ్గిస్తుంది. వింకా మైనర్ తలపై స్కాల్ప్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: