వేసవి కాలం కాస్త ముందుగానే వచ్చేసింది. ఎండలో చర్మ సమస్యలు రావడం చాలా కామన్. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎండలో బయట ఎక్కువగా వెళ్లకుండా ఉండండి. వీలైనంత వరకూ చర్మానికి నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. అలాగే వేసవిలో ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయలు, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సమ్మర్‌లో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది.కలబందలో వివిధ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఖనిజాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.


నిమ్మకాయలో ఉండే పదార్థాలు ముఖంపై డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ మొదలైన వాటిని తొలగించడానికి ఉపయోగపడతాయి. తేనె చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ చేయడానికి పనిచేస్తుంది. దోసకాయ మరియు పెరుగు రెండూ చర్మాన్ని ప్రశాంతంగా, తేమగా ఉంచడంలో ఉపయోగపడతాయి.ఒక గిన్నెలో అలోవెరా జెల్‌ని తీసుకోని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం, తేనె కలపండి. మీకు కావాలంటే ఈ మిశ్రమానికి ఒక చెంచా పెరుగు లేదా దోసకాయ రసం వేసి, మొత్తం మిశ్రమాన్ని ఒక చెంచా సహాయంతో బాగా కలపండి.ముందుగా నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోండి. లేదంటే, మీ చర్మాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ని వేళ్లు లేదా బ్రష్ సహాయంతో ముఖంపై సమానంగా అప్లై చేయండి. ఈ మాస్క్‌ను మీ ముఖంపై 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై మీ ముఖం కడగాలి. మృదువైన టవల్‌తో మీ ముఖాన్ని తుడవండి. చివరగా, మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: