తెల్ల జుట్టు ప్రస్తుత కాలంలో అందరిని ఎంతగానో వేదిస్తున్న సమస్య. ఈ సమస్య చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తుంది.తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో మన ఇంట్లో పదార్ధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ అద్భుతంగా సహాయపడుతుంది. కాఫీ నుండి రంగును తయారు చేసుకోవచ్చు. దీని కోసం, రెండు పెద్ద చెంచాల కాఫీ పొడి, ఒక కప్పు కండీషనర్ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలపండి. తర్వాత ఆ పేస్ట్‌ని జుట్టుకు బాగా పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. అప్పుడు మీ జుట్టును నీటితో మాత్రమే కడగాలి. షాంపూ వాడకూడదు. అలాగే మరో విధానంలో కాఫీపొడి తీసుకొని అందులో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి.అయితే ఇప్పుడు కూడా షాంపూని ఏమాత్రం వాడకూడదు. కాఫీ తెల్లని జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెన్నా కంటే ఎక్కువ ప్రయోజనకరం.


కాఫీ మీ జుట్టుకు సహజంగా పోషణను అందిస్తుంది, ఇది జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ జుట్టు సహజంగా కూల్ గా కనబడేలా చేస్తుంది. కాఫీపొడితో మీ జుట్టు చక్కని మెరుపు సంతరించుకుంటుంది. కాఫీ లోపలి నుండి జుట్టుకు మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది తలలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. కాబట్టి మెరిసే జుట్టు కావాలంటే కాఫీని ఇలా వాడండి. అంతేకాదు, కాఫీ జుట్టుకి మంచి కండీషనర్ కూడా. మీ జుట్టు లోపలి నుండి తేమగా ఉండేలా కాఫీ పనిచేస్తుంది. కాఫీలోని గుణాలు మీ జుట్టును న్యాచురల్ గా సిల్కీగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ న్యాచురల్ టిప్ ని ఖచ్చితంగా పాటించండి. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని పొందుతారు. కెమికల్స్ తో కూడిన షాంపూలు కాకుండా న్యాచురల్ షాంపూలు వాడితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ న్యాచురల్ షాంపూలనే వాడండి. మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: