జూన్ 25వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 


  శ్రీరామ శాస్త్రి జననం : భాషా శాస్త్రవేత్త సాహిత్య విమర్శకులు, జ్యోతిష్య శాస్త్ర పండితుడు అయిన వఝల సీతారామ శాస్త్రి 1878 జూన్ 25వ తేదీన జన్మించారు. పలు శాస్త్రాలను అభ్యసించి సీతారామశాస్త్రి ఎన్నో రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా ద్రవిడ భాషల పరిశీలన తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషి చేశారు అని చెప్పాలి. తెలుగు వ్యాకరణాల తీరుతెన్నులు విషయంలో కూడా ఆయన తన లోతైన పరిశోధనలు వెలువరించారు. భాషా శాస్త్ర పరిశోధనల్లో భాగంగా ద్రావిడ భాషలు పరిశోధిస్తూ ద్రావిడ భాషా పరిశీలన, పలు ద్రావిడ భాషలలోని పోలికలను భేదాన్ని వెల్లడించే ద్రావిడ భాష సామ్యము గ్రంథాలను రచించారు. ఆయన సాహితీ విమర్శకునిగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 

 


 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జననం : భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భారతదేశ ఏడవ  ప్రధానమంత్రి అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్  1931 జూన్ 25వ తేదీన జన్మించారు. భారతదేశం యొక్క ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేశారు. మండల కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారి  కొరకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది ఈయనే.  1969లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1971లో లోక్సభకు ఎన్నికయ్యారు ప్రతాప్ సింగ్. దొంగతనాలు అదుపు చేసే క్రమంలో వ్యక్తిగత వైఫల్యం పొందినందుకు గాను రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందారు ఈయన. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. 

 


 శారదా జననం : తెలుగు మలయాళ సినీ నటి అయిన శారద 1945 జూన్ 25వ తేదీన జన్మించారు. ముఖ్యంగా నటి శారద తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితులే. అయితే శారద అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును సైతం అందుకుని  శారద ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మారిన శారద ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకుంది శారద. ఇక శారద హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైంది శారదా.

మరింత సమాచారం తెలుసుకోండి: