'వెన్నెల కిషోర్' టాలీవుడ్ లో ఆ పేరుకో మ్యాజిక్ ఉంది. ఆయన తెరపై కన్పిస్తే నవ్వుల జల్లులే. బ్రహ్మానందం తరువాత మరో బ్రహ్మానందంగా పేరు తెచ్చుకున్నాడు. కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఆయన దర్శకుడు, సాఫ్ట్ వేర్ కూడా. ఈ రోజు వెన్నెల కిషోర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.

నిజామాబాద్, కామారెడ్డిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు కిషోర్. తండ్రి లక్ష్మి నారాయణ ఇంగ్లీష్ టీచర్. ఆయనకు ఐదుగురు అక్కలు. అందరికీ కిషోర్ చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయిపోయాయి. వెన్నెల కిషోర్ అసలు పేరు బుక్కల కిషోర్ కుమార్. ఈ స్టార్ కమెడియన్ 1980 సెప్టెంబర్ 19 న తెలంగాణలోని నిజామాబాద్ జిలా కామారెడ్డిలో జన్మించారు. అతనికి ఇప్పుడు 41 సంవత్సరాలు. తన కామిక్ పాత్రలకు పేరుపొందిన అతను తన మొదటి చలన చిత్రం పేరును "వెన్నెల" ఇవ్వబడింది  వెన్నెల. అతను జీవదాన్ కాన్వెంట్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత కిషోర్ అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీలో మాస్టర్స్ చదివాడు.

అలా మాస్టర్స్ చేయగానే కిషోర్ వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే 'వెన్నెల' సినిమా కోసం డైరెక్టర్ దేవ కట్టా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. ఆ సినిమాలో ఖాదర్ పాత్రలో ముందుగా శివారెడ్డి నటించాల్సి ఉంది. కానీ ఆయనకు వీసా కుదరకపోవడంతో ఆ పాత్రలో అనుకోకుండా కిషోర్ నటించాల్సి వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకునని వెన్నెల కిషోర్ అయ్యాడు. తరువాత మెగాస్టార్ 'స్టాలిన్' సినిమాలో అవకాశం వచ్చినా ఉద్యోగంలో సెలవు దొరక్క పోవడంతో అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత పూర్తి స్థాయి కమెడియన్ గా మారి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

అతని కుటుంబానికి వస్తే ఆయనకు నలుగురు అక్కలు ఉన్నారు. అతను తన ఇంటర్మీడియట్ పూర్తిచేసే సమయానికి అతని నలుగురు సోదరీమణులు వివాహం చేసుకున్నారు. అతను తన చదువు తర్వాత యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సురేఖ అనే తెలుగు అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వారు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు.

మరింత సమాచారం తెలుసుకోండి: