ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్ కి పరిచమై తొలి సినిమా తో అభిరుచిగల దర్శకుడు అనిపించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. అయన రెండో సినిమా చేసిన మహానటి తో దేశమంతటా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.. రెండో సినిమా తోనే నేషనల్ అవార్డు గెల్చుకున్న దర్శకుడు బహుశా నాగ్ అశ్వినే కావచ్చు. ఇక మూడో సినిమా గా నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా ని చేయబోతున్నాడు. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా, అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు