గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది.. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా అవడానికి కారణాలు ఏవీ కనపడంలేదు..