అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా ని ఇంటిల్లిపాది చూసి ఎంతో ఆనందించింది. దాంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శక నిర్మాతలకు రాగా ప్రస్తుతం ఆ సినిమా కి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు.. ఇటీవలే F3 సినిమా అధికారికాప్రకటన వచ్చింది.  వెంకటేష్ సందర్భంగా ఈ సినిమా ని అధికారికంగా ప్రకటించారు.