గతంలో ఎప్పుడు లేని జోష్ బీజేపీ లో ఇప్పుడు కనిపిస్తుంది.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. సౌత్ లో కూడా కర్ణాటక లో అధికారంలో ఉంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడి అధికారంలోకి రావాలని చూస్తుంది.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు కూడా గతంలోకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి రెండో ప్రజాభిమానం ఉన్న పార్టీ గా చెప్పొచ్చు.. తెరాస పార్టీ కి ప్రజలు పట్టం కట్టినా మొన్నటి దుబ్బాక ఎన్నిక లో బీజేపీ ని గెలిపించి కేసీఆర్ కి ఝలక్ ఇచ్చారు.