పబ్ జీ గేమ్ అంటే ఆసక్తిలేని వారు ఉండరు. ఈ గేమ్ మాయలో పడి ఇదివరకు ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ఈ గేమ్ పై వినియోగదారులకు ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ టైం నడుస్తున్నందున వినియోగదారులు పలు రకాల ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లో కుర్రకారును ఉర్రుతలూగించిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా కనిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పబ్ జీ గేమ్ ఆడుతుండగా ఎవరో ఆమెను గేమ్ లో షూట్ చేశారు.
And it begins 🤓 pic.twitter.com/HicfM5Ctpa
— nidhhi agerwal (@AgerwalNidhhi) May 14, 2020
అయితే ఈ విషయాన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ "అండ్ ఇట్ బిగిన్స్ " అని ట్వీట్ చేసింది. ఈ ఒక్క ట్వీట్ తో అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. అయితే కొందరు మాత్రం మీతో పబ్ జీ ఆడాలనివుంది మీ పబ్ జీ ఐడీ ఇవ్వండని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ భామ తన యాక్టింగ్ స్కిల్స్ ను పెంచుకోవడానికి ఆన్లైన్ లో శిక్షణ తీసుకుంటూ వుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయిన వలస కార్మికుల కోసం అటు సెంట్రల్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పలు రిలీఫ్ ఫండ్స్ కోసం నిధి విరాళాలు అందజేసింది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ తరపున కూడా ఈ అమ్మడు రిలీఫ్ ఫండ్స్ ని అందజేసింది .
Caught playing #pubg 🙈🤓 my new obsession pic.twitter.com/QDsbYQSzYa
— nidhhi agerwal (@AgerwalNidhhi) May 15, 2020