ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో కకావికలం అవుతుంది.  అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ మద్య కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సడలిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా పెరూ దేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.  కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సి నగర మేయర్ అందూ ఛీత్కరించేలా చేసుకున్నాడు.  వివరాల్లోకి వెళిలే.. పెరూ దేశంలో టంటారా అనే ఓ చిన్న పట్టణానికి జేమీ రొనాల్డో ఉర్బినా టోరెస్ అనే వ్యక్తి మేయర్ గా వ్యవహరిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో తన మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్నారు.  ఆ సమయంలో అక్కడికి పోలీసులు వెళ్లడంతో మనోడికి ఏం చేయాలో పాలుపోలేదు. పోలీసుల రాకతో కంగుతిన్న మేయర్ టోరెస్ పక్కనే ఉన్న ఓ శవపేటికలో దూరి చచ్చినవాడిలా పడుకున్నాడు.

 

పైగా ఓ మాస్కు కూడా ధరించి శవంలా నటించాడు. అతడి నాటకాన్ని పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. జాతీయ స్థాయిలో విధించిన లాక్ డౌన్ నియమావళిని ఉల్లంఘించాడంటూ అతడిపై ఆరోపణలు మోపారు. కాగా, సదరు మేయర్ పై అధికార వర్గాల్లోనూ సదభిప్రాయం లేదు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఏనాడూ సమీక్ష జరపడంగానీ, అధికారులకు దిశానిర్దేశం చేయడంగానీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. పెరూలో జాతీయ స్థాయి లాక్ డౌన్ ప్రకటించి 66 రోజులు కాగా, లాక్ డౌన్ ప్రారంభమయ్యాక సదరు మేయర్ టంటారా పట్టణంలో ఉన్నది కేవలం 8 రోజులేనట. దాంతో స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మేయర్ తమకొద్దని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: