ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2627కు చేరింది. వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఈ విషయాలను ప్రకటించింది. అయితే వైద్య, ఆరోగ్య శాఖ గత కొన్ని రోజుల నుంచి జిల్లాల వారీగా జాబితా విడుదల చేయడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా కోయంబేడు లింక్ ల వల్ల కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 56 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో 17 కేసులు కువైట్, దుబాయ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి నిర్ధారణ కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: