కరోనా కష్టకాలంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకులో ఖాతా ఉన్న వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం శాలరీ అకౌంట్ ఉన్నవారికి మాత్రమేనని... ఇతరులకు ఈ ఆఫర్ వర్తించదని పేర్కొంది. ఈ సదుపాయం ద్వారా శాలరీ అకౌంట్ ఉన్నవారు అదనపు డబ్బును పొందవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందాలనుకునేవారు ఆన్‌లైన్ అకౌంట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఇన్‌స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
బ్యాంక్ ఉద్యోగులు వారి ఖాతాలను పరిశీలించి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. దాదాపు 48 గంటల్లోనే అర్హతను బట్టి నగదు ఖాతాలలోజమవుతుంది. ఉద్యోగులు పొందే శాలరీ కంటే మూడు రెట్ల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎంత నగదు ఉపయోగించుకుంటామో ఆ నగదుపై కొంత వడ్డీ వసూలు చేయనుందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి