దేశంలో కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు.. దాని కోసం సుమారు 80 దేశాలు కఠోర శ్రమ చేస్తున్నాయి. ఇక కరోనా నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి.. అందుకోసం మాస్క్ తప్పని సరి ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి.. శానిటైజర్ వీలైనంత వరకు మనతో ఉంచుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని నామ మాత్రంగా దూరం పెట్టవొచ్చు. 

 

ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా వచ్చారు.. అతన్ని మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందకు మహిళా అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..  నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు.


రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్​ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: