తాజాగా ఏపీ సైతం కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి సన్నద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కమిటీ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి