తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హారజయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేసింది. తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాస్కు ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించింది. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలని.. అక్కడ అందించే చికిత్సలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: