రెక్కాడితే కానీ డొక్కాడని వలసదారులు పట్టించుకునే నాధుడే లేరు. ఎక్కడో పుట్టి కడుపు చేత పట్ట్టుకొని పక్క రాష్ట్రాలకు పని కోసం వేల మైళ్ళు వెళ్లి అక్కడ పూట గడుపుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లాపూర్, కొత్తపేట పరిధిలోగల కొంత మంది వలసజీవులకు ఆపన్నహస్తం అందించారు పోలీసులు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చి ఆకలితో బాధ పడుతున్న వారు పెట్రోలింగ్ పోలీసుల కంట పడటంతో ఒక వంద కుటుంబాలకు కొంత నగదు, నిత్యావసర వసతులను అక్కడి ఎస్సై అందించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: