కొద్ది రోజులుగా బంగారం ధరలు మళ్లీ పైపైకి వెళుతున్నాయి. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో బంగారం పై ఇన్వెస్ట్ చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా బంగారం ప్రియులు కూడా కొనేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతన్నాయి. ఇక తాజా ధరలు పరిశీలిస్తే...హైదరాబాద్ బులియన్
మార్కెట్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,800 నుండి రూ.45,900 లకు చేరింది. అంతే కాకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 49,970 నుండి 50,070 కి చేరుకుంది. మరోవైపు
వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో
వెండి ధర రూ.50 పెరిగి 76,300 కు చేరుకుంది.