ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ పెద్ద భవనం కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న లోయలోకి భవనం సగ భాగం అమాంతం పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఈ ఘటనను వీడియోలో బంధించాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ షాకింగ్ ఘటన చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్, జోషిమఠ్‌లోని జడ్కుల సమీపంలో ఘటన జరిగింది. లోయకు పక్కనే ఉన్న ఓ హోటల్ భవనం సగ ఒక భాగం కూలిపోయింది. అయితే ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతపెద్ద హోటల్ కూలితే ఎవరికీ ఏం కాకుండా ఎలా ఉంటుంది ? అనుకోకండి. ఎందుకంటే హోటల్ లోని వారంతా ఈ ఉదయమే ఖాళీ వెళ్లిపోయారట. దీంతో గండం గట్టెక్కింది అన్నమాట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: