హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఈరిజిస్ట్రేషన్ కచ్చితంగా అమలు చేయనుంది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంద్వారా పర్యాటకుల అంతర్రాష్ట్ర కదలికలన్నీ పర్యవేక్షిస్తామని తెలిపారు. అయితే ఈ నిబంధనల నుంచి పారిశ్రామికవేత్తలు, సర్వీస్ ప్రొవైడర్లు వైద్యచికిత్స కోసం వచ్చేవారు, ప్రభుత్వాధికారులు, కార్మికులు, వ్యాపారులకు మినహాయింపునిచ్చింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులిద్దరికీ టీకా సర్టిఫికెట్, ఆర్‌టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను మినహాయించారు. 13వ తేదీ నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. లేదంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ అయినా ఉండాల్సిందేనని హిమాచల్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష సర్టిఫికెట్‌తోపాటు టీకా వేయించుకున్న సర్టిఫికెట్ కూడా ఉండాలని ఉత్తర్వులు జారీచేశాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి