నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమమే ఊపిరిగా బతికిన విప్లవ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ, ఆర్‌కేగా ప్ర‌పంచానికి తెలిసిన ఆయ‌న ఇటీవ‌ల మ‌ర‌ణించిన విష‌యం విధిత‌మే. ఆయ‌న‌కు అక‌స్మాత్తుగా కిడ్నీల స‌మ‌స్య మొద‌లై.. డ‌యాల‌సిస్ ప్రారంభిస్తున్న త‌రుణంలోనే రెండు కిడ్నీలు ఫెయిల‌య్యాయి. దీనికి తోడు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ఆయ‌న‌కు పార్టీ మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికీ ద‌క్కించుకోలేక‌పోయింది.

తాజాగా ఆర్‌కే సోద‌రుడు సుబ్బారావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆర్‌.కే. త‌న చివ‌రిబొట్టు ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేశాడు అని తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన గొప్ప ఉద్య‌మ‌నాయ‌కుడు ఆర్‌.కే. మా కుటుంబ స‌భ్యుడు కావ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని వెల్ల‌డించారు. అన్న క‌డ చూపు కూడ చూడ‌లేద‌ని.. అన్న దేహాన్ని త‌న భుజాన మోయ‌లేద‌నే బాధ ఉంద‌ని తెలిపారు. మొద‌టి నుంచి విప్ల‌వ ఉద్య‌మ‌కారుడుగా ఉండ‌డంం వ‌ల్ల‌నే మొత్తం త్యాగం చేశార‌ని వివ‌రించారు. అటువంటి త్యాగాలు మావోయిస్ట్ ఉద్య‌మంలో స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని వెల్ల‌డించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

#rk