తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా   టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధ‌ర్నాల‌కు, నిర‌స‌న‌కు పిలుపున‌చ్చిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు క‌డుతూ ఓ యువ‌కుడు క‌రెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. వివరాల‌లోకి వెళ్లితే.. కోదాడ‌లోని బంజార‌కాల‌నీలో  సునీల్ (23) నివాసంసంబంధించిన ఫ్లెక్సీని క‌డుతుండ‌గా విద్యుత్‌ ఉంటున్నాడు.

 శుక్ర‌వారం  కోదాడ ప‌ట్టణంలోని రంగా సినిమా థియేట‌ర్ స‌మీపంలో ధ‌ర్నాకు సంబంధించిన ప్లెక్సీని క‌డుతుండ‌గా అక‌స్మాత్తుగా క‌రెంట్ షాక్ కొట్టింది. సునీల్ షాక్‌కు గురై అక్క‌డిక్క‌డే మృత్యువాత‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో సునీల్‌తో పాటు మ‌రో యువకుడు కుడుముల వెంక‌టేష్ అనే వ్య‌క్తి కూడ షాక్‌కు గురై తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. వెంట‌నే  స్థానికులు వెంక‌టేష్‌ను స‌మీపంలో ఉన్న‌టువంటి ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం తెలుసుకున్న కోదాడ పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: