కరోనా తర్వాత మళ్లీ హైదరాబాద్ మెట్రో రైలుకు పూర్వ వైభవం వచ్చేసింది. కొవిడ్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ జనం మెట్రో రైలు జోరుగా ఎక్కేస్తున్నారు. అత్యధిక మంది నిన్న సోమవారం మెట్రోలో ప్రయాణించి రికార్డు సృష్టించారు. సోమవారం ఒక్కరోజే  3.94 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో రాకపోకలు సాగించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ స్థాయిలో జనం ఎక్కడం ఇదే మొదటి సారి అని మెట్రో అధికారులు సంబరపడుతున్నారు.


గత రికార్డులు చూసుకుంటే..  2020 ఏప్రిల్‌కు ముందు సగటున ప్రతి రోజూ 4 లక్షల మంది హైదరాబాద్ మెట్రో ద్వారా రాకపోకలు సాగించేవారు. ఒక్కోసారి రోజుకు నాలుగున్నర లక్షల మంది వరకూ హైదరాబాద్ మెట్రోలో వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.. 5 లక్షల మార్కు మాత్రం దాటలేదు. ఆ తర్వాత కొవిడ్‌ వచ్చింది. మెట్రో ప్రయాణికులు తగ్గిపోయారు. మళ్లీ ఇప్పుడు మెట్రోకు పూర్వకళ వస్తోంది. సోమవారం రికార్డుతో దాదాపు 4 లక్షల మార్కు తాకినట్టే అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: