రామన్‌ మెగసేసే అవార్డు.. సేవారంగంలో ఈ అవార్డుకు నోబెల్‌ బహుమతికి ఉన్నంత పేరు ఉంది. అయితే.. తాజాగా కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు ఈ అవార్డు ప్రకటించారు. అయితే ఆమె ఆ రామన్  మెగసెసే అవార్డును తిరస్కరించడం విశేషం. ఎందుకంటే.. ఆమె సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు. అయితే ఏంటి అంటారా.. ఈ అవార్డు ఇస్తున్న దేశం ఫిలిప్పీన్స్. ఆ దేశం  ఫిలిప్పీన్స్ లో కమ్యూనిస్టులను క్రూరంగా హింసించిన చరిత్ర ఉందట. అందుకే ఆ దేశ దివంగత అధ్యక్షుడు రామన్  మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును  తీసుకోవడం భావ్యం కాదని కమ్యూనిస్టు పార్టీ భావిస్తోంది.

అందుకే పార్టీ నిర్ణయం మేరకు కేరళ మంత్రి శైలజ రామన్‌ మెగసేసే అవార్డును తిరస్కరించారు. ఈ అవార్డు ఎల్ డీఎఫ్  ప్రభుత్వం, కేరళ ఆరోగ్య శాఖ సమష్టి కృషి ఫలితంగా లభించిందని.. అందుకే  ఈ పురస్కారాన్నివ్యక్తిగత హోదాలో స్వీకరించలేనని శైలజ స్పష్టం చేశారు. అయితే.. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు మాత్రం ఆమె  కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: