చైనా కరోనా కేసుల విషయంలో ప్రపంచానికి తప్పుడు లెక్కలు చూపిస్తుంది. రోజు కోట్లకు కోట్ల కేసులు నమోదు అవుతూ ఉంటే కేవలం వేలల్లో మాత్రమే నమోదయ్యాయంటూ చెబుతుంది. ఆస్పత్రులన్ని బిఎఫ్-7వేరియంట్ బాధితులతోనూ, మార్చురీలన్నీ మృతదేహాలతో నిండిపోతున్నా ఇక్కడ కేసులు కేవలం 5000  మాత్రమే నమోదు అయ్యాయని, మరణాలు కేవలం 500 మాత్రమే సంభవించాయి అంటూ తప్పుడు లెక్కలు ఇస్తూ ప్రపంచాన్ని ఏమార్చడానికి ప్రయత్నిస్తుంది.

జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేశాక గత 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా సోకిందంటూ అధికార పత్రాల ద్వారా లీక్ అవ్వడంతో..నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా రోజువారి  కేసుల విషయాలను వెల్లడించబోమని ప్రకటించింది. కింగ్ డవో మున్సిపాలిటీలో ఒక్కరోజే 5.3 లక్షల కేసులు నమోదయితే ఆ గణాంకాలను వెంటనే ఆన్లైన్లో నుంచి తొలగించారు. బీజింగ్ లో కంటైనర్లలో మృతదేహాలను తరలిస్తున్నారని, ఒక స్మశానంలో ఒకరోజే పది కంటైనర్ల మృతదేహాలు కనిపించాయని ఒకరు పోస్టు చేశారు .కోవిడ్ మృతుల వ్యవహారానికి సంబంధించి అంత్యక్రియలకు రోజులు పడుతుందని రాయిటర్స్ చెప్తుంది. చైనాలోని చాలా గ్రామాల్లోని క్లినిక్లు జ్వరం తదితర కరోనా లక్షణాలు బాధితులతో కిక్కిరిసిపోతున్న కూడా చైనా ఏమి జరగనట్టే ప్రవర్తిస్తుంది. రాబోయే 2023లో చైనాలో 20 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవచ్చని అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: