ఇది ప్రపంచానికే ఓ గుడ్ న్యూస్‌ అని చెప్పొచ్చు. గతంలో ఓజోన్ పొరకు పడిన రంధ్రం క్రమంగా మూసుకుపోతోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 43ఏళ్లలో ఓజోన్‌ పొర రంధ్రం మూసుకుపోనున్న దట. నాలుగేళ్లకోసారి జరిగే శాస్త్రీయ గణన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అనేక ప్రమాదకర రసాయనాలను నిషేధించిన 35ఏళ్ల తర్వాత ఈ ఫలితాలు లభిస్తున్నాయి.

మన వాతావరణానికి 30కి.మీ. ఎత్తున ఓజోన్‌ పొర ఉంటుంది. 2040నాటికి గానీ 1980నాటి స్థితికి ఓజోన్‌ పొర లభించే అవకాశం ఉందట. ఆర్కిటిక్‌లో 2045నాటికి సాధారణస్థితికి ఓజోన్‌ పొర వచ్చే అవకాశం ఉందట. ఇక అంటార్కిటికా ప్రాంతంలో 2066 నాటికి ఓజోన్ పొర సాధారణ స్థితికి వస్తుందట. అయితే.. ఓజోన్‌ పొర రంధ్రం పూర్తిగా పూడ్చుకోదన్న ఐక్యరాజ్య సమతి తెలిపింది. అయినా సరే.. ఓజోన్ పొర రంధ్రాన్ని తగ్గించే ప్రయత్నాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: