ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. నువ్వు నిస్సిగ్గుగా నామీద ఆరోపణలు చేయడం సరైనది కాదు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. నిన్ను ఎవరు నమ్మరు.. ఆరోజు సోనియాగాంధీకి ఇచ్చిన మాట దగ్గర నుంచి నేటి నామీద చేసిన కామెంట్ల వరకు నిన్ను ఎవరు నమ్మరని కేసీఆర్‌ను ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


నిన్ను మర్యాదగా సంబోధిస్తూ మాట్లాడుతున్నా.. నువ్వు ఆ స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడటం నీ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయికి తగదు.. ఖమ్మం జిల్లా నైసర్గిక స్వరూపం ఏమాత్రం నీకు తెలియకపోయింది నిజం కాదా.. అందువల్లనే నైసర్గిక స్వరూపం తెలియదు కాబట్టి మొత్తం నువ్వే చూసుకోవాలి తుమ్మల అంటూ చెప్పిందే నిజం కాదా అంటూ తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ పై మండిపడ్డారు. నేను ప్రజల కోసం పార్టీలు మారాను ఓట్ల కోసం నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు ఎట్లా నమ్ముతారు కేసీఆర్ అంటూ తుమ్మల ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: