తెలంగాణలో ఇప్పటి వరకూ ఎన్నికల తనిఖీల్లో దాదాపు 425కోట్ల రూపాయల నగదు, 162 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. అయితే ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన డబ్బు కనీసం 5శాతం కూడా లేదు. సాధారణ ప్రజలు, వ్యాపారులు తీసుకెల్తున్న డబ్బే ఎక్కువగా ఉందని ఈసీ తెలిపింది. తనిఖీల్లో పెళ్లి, విద్యావసరాల కోసం తీసుకెళ్తున్న నగదును సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాలు చూపించని డబ్బును సీజ్ చేస్తున్నారు.


ఏవైనా అవసరాల కోసం చేతి బదులు తీసుకొని వచ్చే వాళ్లు సరైన పత్రాలు చూపించడానికి తంటాలు పడుతున్నారు. పిల్లల కళాశాలల ఫీజులు, పెళ్లిళ్ల వస్త్రాలు, బంగారం కొనడానికి డబ్బులు తీసుకెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. 10లక్షల లోపు నగదు పట్టుబడితే జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కి అప్పజెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: