కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సిట్టింగ్‌ స్థానమైన నల్గొండ నుంచి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్‌ రెడ్డిని బరిలో దించేందుకు పార్టీ అధిష్టానం ఇటీవల నిర్ణయించింది. అయితే భువనగరి టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది.  ఈ టికెట్‌ను తమ కంటే తమకు కేటాయించాలని చాలా మంది నేతలు పోటీలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్‌ లోకసభ భువనగిరి నుంచి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్నారు. తనకే టికెట్‌ వస్తుందన్న విశ్వాసంతో.... క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు.

అయితే ఆ టికెట్‌ కోసం శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేంద్ర రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డికి టికెట్‌ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా తన సతీమణి లక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. వీరితోపాటు కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి కుమారుడు డాక్టర్‌ సూర్యపవన్‌ రెడ్డి కూడా ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో తాజా రాజకీయ పరిణామలతో ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: