జగన్‌ అనుకూల ఐపీఎస్‌లుగా పేరున్న కొందరికి సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఏపిలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్చార్జి డిజిపి కేవి రాజేంద్ర నాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అతుల్ సింగ్ కు ఎసిబి డీజీ గా  పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

ఇక పీవీ సునీల్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శంకబ్రత బగ్చికి అగ్నిమాపక శాఖ డీజీ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కౌంటర్ ఇంటెలిజన్స్ సెల్ ఎస్పీ గా ఉన్న రిశాంత్ రెడ్డి నీ డిజిపి కార్యాలయం లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎర్ర చందనం టాస్క్ ఫోర్సు బాధ్యతల నుంచి కూడా రిశాంత్ రెడ్డిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: