తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సుల్లో నెలవారీ పాసులు తీసుకుని ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ 19 కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్‌ కాలంలో అప్పటికే నెలవారీ పాసులు రెన్యువల్ చేయించుకున్న వారి బస్ పాసులు, విధించిన లాక్ డౌన్ల కారణంగా వృథా అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అలాంటి వారికి ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం బాగా ఉపయోగపడనుంది.

విధించిన కోవిడ్ 19 కరోనా వైరస్ లాక్‌డౌన్‌ సమయానికి ఎవరైతే నెలవారీ లేదా అంతకు మించిన కాలానికి బస్ పాసులు తీసుకున్నారో వారు అందరూ కూడా ఆ బస్ పాస్‌లో (ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఎయిర్‌పోర్ట్‌ లైనర్ పుష్పక్‌ ఎసీ బస్‌) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఇప్పుడు తిరిగి ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్‌ జోన్‌ టీఎస్‌ ఆర్టీసీ సంస్థ కల్పించనుంది. దీని కోసం పాస్ వినియోగదారులు చేయాల్సిన పని ఏమిటంటే కేవలం లాక్ డౌన్ సమయానికి ముందు తీసుకున్నటువంటి అప్పటి బస్‌ పాస్‌ను కౌంటర్‌లో తిరిగి ఇచ్చేసి మరలా వారి నుండి కొత్త కార్డు తీసుకోవడమే అని దీనికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు అని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. కాగా ఈ కొత్త పాస్‌లో లాక్ డౌన్ వల్ల కోల్పోయిన రోజులను కలిపి మరలా ఇప్పుడు కొత్తగా పాసులు జారీ చేయనున్నారు. ఈ సదుపాయాన్ని నవంబర్‌ 30 వరకు వినియోగదారులు అందరూ వినియోగించుకోవచ్చు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కావున గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు అందరూ టీఎస్ ఆర్టీసీ వారు అందించిన ఈ సదుపాయాన్ని వీలైనంత త్వరగా వినియోగించుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: