ప్రస్తుతం ప్రపంచాన్ని పెడదారి పట్టిస్తున్న పెనుభూతం డ్రగ్స్... ఈ డ్రగ్స్ మత్తులో పడి లక్షలాదిమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అయితే సంబంధిత ప్రభుత్వాలు మరియు అధికారులు డ్రగ్స్ ను అంతమొందించడానికి ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు మరియు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వారికీ దొరకకుండా ఉండడానికి కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. మత్తు మందు బారిన పడి మరణించిన యువత గురించి వారి తల్లితండ్రులు మరియు బంధువులు పడే వేదన తెలిస్తే మళ్ళీ అలాంటి దారిలో వెళ్ళరు. కానీ కొన్ని సంఘటనలను చూస్తుంటే పుష్ప సినిమా మరియు డ్రగ్స్ డాన్ వెబ్ సిరీస్ ల నుండి ఏమైనా స్ఫూర్తి పొందారా అన్న అనుమానాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడి నుండో తీసుకురావాలంటే పోలీసుల బెడద అని భావించారో ఏమో కానీ ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏకంగా ఇంటిలోనే గంజాయిని పెంచుతున్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. మార్కాపురం పట్టణ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, బాపూజీ కాలనీలో పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అలా శోధించిన పోలీసులకు ఒక ఇంట్లో చూసిన దృశ్యం వారిని షాక్ కు గురి చేసింది. దాసరి దానమ్మ మరియు దాసరి పేరయ్య ఇంట్లో మూడు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు SEB అధికారులు వచ్చి నిర్ధారణ చేశారు. దీనితో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు.

అయితే మరో వ్యక్తి శివ పోలీసులు వచ్చి విచారిస్తున్నారని తెలుసుకుని అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఇతను కనుక  దొరికితే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలుసుకువె అవకాశం ఉంటుంది. పోలీసులు చెబుతున్న ప్రకారం ఇలా ఇంట్లో పండించిన గంజాయిని కాలేజ్ విద్యార్థులు మరియు విద్యార్థినులకు పంపిణీ చేయడానికని అనుమానిస్తున్నారు. ఇప్పటికే గంజాయి సాగు చేయకూడదు అని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. దీనితో చాలా వరకు ఈ సాగు జరగడం లేదు. కానీ ఇలా కొన్ని చోట్ల మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా గంజాయి సాగును చేస్తున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: