దేశం మొత్తం ఇప్పుడు ఎక్కువగా రాజకీయాల చుట్టూ తిరుగుతోంది.ఎన్నికలలో ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుందో అనే విషయం పైన అటు నేతలు పార్టీలు సైతం చాలా టెన్షన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రాలోని ఎన్నికలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే అటు కూటమి నుంచి టిడిపి జనసేన బిజెపి పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఆంధ్రాలో కూటమి గెలిస్తే చంద్రబాబుకు కాస్త కలిసి వస్తుందని చెప్పవచ్చు.


అయితే ఎన్నికల ముందుకు వరకు మోడీ హవా బాగానే కనిపించిన.. బిజెపి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అవకాశం ఉందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడిచిన తర్వాత ఒకసారిగా సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ఇండియా కూటమి హవా క్రమక్రమంగా పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికే జరిగిన రెండు విడుతల పోలింగ్లో కూడా తక్కువ ఓటింగ్ శాతం నమోదయింది. ఇది కాంగ్రెస్కు చాలా అనుకూలంగా మారుతోందని సమాచారం.. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో మాత్రం అటు చంద్రబాబు జగన్ కు చాలా ఇబ్బంది ఉంటుందట.


అసలు విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అప్పులు చేయడానికి పర్మిషన్ ఇవ్వదని ఏపీలో ముఖ్యంగా ఆదాయం తక్కువ మొదటి నుంచే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనీసం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా సరే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికే అప్పులు ఎక్కువగా ఉన్న వీటికితోడు అటు జగన్ చంద్రబాబు ఓ రేంజ్ లో ఉచిత పథకాలను ప్రకటించుకున్నారు.. వీటిని అమలు చేయాలి అంటే కచ్చితంగా భారీ అప్పులు తేవాల్సి ఉంటుంది.. ఇన్ని రోజులు మోదీ కేంద్రంలో ఉన్నారు కాబట్టి వీరికి అప్పులకు పర్మిషన్ వచ్చాయి. కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం అప్పులు ఇచ్చేందుకు ఒప్పుకోదు.. ఎవరు అధికారంలోకి వస్తారా అంటూ అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా కాస్త టెన్షన్ లోనే ఉన్నారు. దీంతో కచ్చితంగా ఆంధ్రాలో ఇబ్బందులు తప్పవని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: