ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న వేళ పలు రకాల సర్వేలు సైతం తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ సర్వే సంస్థలు రాజకీయాల పైన చాలా ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సీజన్ రావడంతో జాతీయస్థాయిలో పలు రకాల సంస్థల నుండి అనేక రకాల ఫలితాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో చాలా మేరకు ఫలితాలు ఎక్కువగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ సర్వే సంస్థ విడుదల చేసిన ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు కాక పుట్టించేలా చేస్తున్నాయి.


ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆంధ్ర సర్వే న్యూస్ ఏఎల్ఎన్ సమస్త ద్వారా తాజాగా ఒక సర్వే ఫలితాలను విడుదల చేశారు.. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలలో దాదాపుగా 90,604 శాంపిల్స్ ను సేకరించిన తర్వాత ఈ సర్వే ని రిలీజ్ చేసినట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీకి 49%.. కూటమికి 43%.. కాంగ్రెస్ కి 4 శాతం ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయంటూ ఈ సర్వే వెల్లడించింది.


ఇక సీట్ల విషయానికి వస్తే.. అధికార పార్టీ వైసీపీకి 102 నుంచీ 108 సీట్లలోపు వస్తాయని తెలియజేశారు. 67 సీట్లను కూటమి అందుకుంటుందంటూ ఈ సమస్త అంచనా వేస్తోంది. అలాగే కీలకమైన నియోజవర్గాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో వైసిపి భారీ విజయం సాధిస్తుందని.. అలాగే కుప్పంలో చంద్రబాబు కూడా మంచి విజయాన్ని అందుకుంటారని ఈ సర్వేలో తెలియజేస్తున్నాయి.. అయితే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కు మళ్ళీ కూడా ఓటమి తప్పదని.. జనసేన పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గంలో 7000 ఓట్లతో ఓడిపోయి అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో గుబులు పుట్టేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: