సింహం సింగిల్ గా బరిలోకి దిగుతుంది అనే నినాదంతో మరో పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అధికార వైసిపి ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది  అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయగా అందరూ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే వైసిపి మేనిఫెస్టో ని ప్రకటించిన నేపథ్యంలో.. తమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థులందరూ కూడా ఎంతో ధీమాతో ఉన్నారు.


 ఇలా రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వైసిపి పార్టీ ముందుకు సాగుతున్న నేటి తరుణంలో.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థుల తీరు చర్చనీయంశంగా మారిపోతుంది. ఏకంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా కడప అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తీరుపై సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది తెలుస్తుంది. సాధారణంగా కడప నియోజకవర్గం అంటే మైనారిటీలకు కంచుకోట అని పిలుస్తూ ఉంటారు. శివానందరెడ్డి తర్వాత అక్కడ ముస్లింలే ప్రతిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు.


 ఇక 2014 నుంచి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ గెలుస్తూ వస్తున్నారు అంజద్ భాష. 2019లో కూడా ఆయనే గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా కూడా పదవిని దక్కించుకున్నారు. అయితే ఇలా పదవిలో ఉన్నప్పుడు అంజాద్ భాష తమ్ముడు సహా మరి కొంతమంది కుటుంబ సభ్యులు ఇష్టారీతిన   వ్యవహరించారని తమ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు అంటూ ఒక చెడ్డ పేరు వచ్చింది. దీంతో గత ఐదేళ్ల కాలంలో కడప నియోజకవర్గంలో వైసిపికి కాస్త ఆదరణ తగ్గిందని టాక్. ఇక మరోవైపు టిడిపి నుంచి అక్కడ పోటీ చేస్తున్న మాధవరెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల నామినేషన్ సమయంలో కూడా మాధవరెడ్డి వెంట భారీగా జనం తరలిరాగా.. అంజాద్ భాష వెంట మాత్రం అంతగా కార్యకర్తలు కనిపించలేదు. డబ్బు ఖర్చు పెట్టడం విషయంలో కూడా అంజాద్ భాష టిడిపి అభ్యర్థితో పోల్చి చూస్తే కాస్త వెనుకబడి ఉన్నాడు అన్నది తెలుస్తోంది  దీంతో ఇప్పటికైనా ఈ వైసిపి అభ్యర్థి జాగ్రత్త పడకపోతే..ఓడిపోయే ప్రమాదం ఉందని.. లేదంటే మెజారిటీ భారీగా తగ్గే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అతని తీరుపైతీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: