కోలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటీ మణులలో మాళవిక మోహన్ ఒకరు . ఈమె సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన పేట , తలపతి విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ మూవీ లతో మంచి గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది . ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందడంతో ఈ సినిమాలతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు దక్కింది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంది. అందులో భాగంగా ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజాగా మాళవిక మోహన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ... నాకు గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించాలని ఉంది.

కూల్ గా కనిపించే లేడీ యాక్షన్ లోకి దిగితే ఎలా ఉంటుందా అనేది చూపించాలి అనేది నా కోరిక. ఇప్పటికే నేను అనేక రకాలు అయిన యాక్షన్ సీక్వెన్సెస్ లో శిక్షణ కూడా తీసుకున్నాను. అలాంటి పాత్ర దొరికితే ఆనందంగా చేస్తాను అని ఈమె తాజాగా చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ తన క్రష్ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. డ్రామా , రోమాన్స్ , రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ , థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడతా అని ... యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ లు ఇష్టం ఉండవు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mm