బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడు వెలుగులోకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక హీరోతో చెట్టా పట్టాలేసుకొని తిరిగి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన హీరోయిన్లు.. ఆ తర్వాత కాలంలో వారికి బ్రేకప్ చెప్పి మరో హీరోతో ప్రేమలో పడటం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఇక ఒకరితోనే ప్రేమలో మునిగి తేలి వారిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నాళ్లపాటు వారి ప్రేమను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ.. ఇక ఏదో ఒక విధంగా బయటపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఈ మధ్యకాలంలో అయితే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాదు.. ఏకంగా తమ లవ్ స్టోరీ ఎలా సాగింది ఒకరితో ఒకరం ఎలా ప్రేమలో పడ్డాం అనే విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి  అయితే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లో కొనసాగుతున్న పరిణితి చోప్రా ప్రేమ వ్యవహారం కొన్ని రోజులపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ ట్రాఫిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అందరూ హీరోయిన్లు తోటి నటులతో ప్రేమలో పడుతుంటే అటు హీరోయిన్ పరిణితి చోప్రా మాత్రం రాజకీయ నాయకుడితో ప్రేమలో పడింది.



 ఆప్ ఎంపీ అయినా రాఘవ చద్దాతో ఎన్నో రోజులపాటు పరిమితి చోప్రా ప్రేమలో మునిగి తేలింది. ఇక వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎన్నో వార్తలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక చివరికి వీరి ప్రేమను బహిర్గతం చేసి పెళ్లితో ఒక్కటైంది ఈ జంట. గత ఏడాది సెప్టెంబర్ లో వీరికి పెళ్లి జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తన లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది పరిణీతి చోప్రా  తొలిసారి రాఘవ్ ను లండన్ లో కలిసాను. ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రేమలో పడిపోయా. నాకు కాబోయే భర్త అతనే అనిపించింది. అప్పటికి ఆయన గురించి నాకు ఏమీ తెలియదు. వయస్సు ఎంత? పెళ్లయిందా? ఏం చేస్తుంటారు అన్న విషయం కూడా అడగలేదు అంటూ పరిణితి చోప్రా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: