రాజ‌కీయంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అవ‌నిగడ్డ‌. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకొ ని.. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మండ‌లి బుద్ద ప్ర‌సాద్‌.. జ‌న‌సేన నుంచి పోటీ చేసేలా లైన్ క్లియ‌ర్ చేశారు. మొత్తంగా సీనియ‌ర్ నేత‌ను సంతృప్తి అయితే ప‌రిచారు కానీ.. స్థానికంగా ఉన్న రాజ‌కీయాల‌ను మాత్రం టీడీపీ నేత‌లు వ‌దిలేశారు. దీంతో అవ‌నిగ‌డ్డ సీన్ మారిపోతోంది. కీల‌క నేత‌లు అంద‌రూ కూడా.. పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొడుతున్నారు.


మోపిదేవి మండలం, బోడగుంట గ్రామంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు  సమక్షంలో కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, సింహాద్రి వికాస్ లు వారికి  పార్టీ కండువా కప్పి ఘనంగా వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో టీడీపీకి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బ‌లంగా ఉన్న‌ మునిపల్లి శివ, కొక్కిలిగడ్డ ఇమ్మానుయేలు, కొక్కిలిగడ్డ అజయ్ బాబు,కొక్కిలిగడ్డ సుందర్ సింగ్ వంటి ఎస్సీ నేత‌లు జారిపోయారు.


టీడీపీ ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌క‌పోవ‌డాన్ని వారు ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్‌ను ఈ సంద‌ర్భంగా ఆకాశానికి ఎత్తేశారు.  సంక్షేమ పాలన, నిత్యం నియోజకవర్గం సంస్థలపై పరిష్కారాన్ని కృషి చేస్తు అవనిగడ్డ నియోజకవర్గం సింహాద్రి రమేష్ బాబు  విధానాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు, మోపిదేవి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తామన్నారు. ఇది అవ‌నిగ‌డ్డ‌లో కీల‌క‌మైన ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయనుంది.


వైసిపి అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావుకు ఈ ప‌రిణామం మ‌రింత క‌లిసి వ‌చ్చేలా చేసింది. నిజానికి ఇక్క‌డ ఈ సారి టీడీపీ పోటీ చేసి ఉంటే.. విజ‌యం ఆ పార్టీవైపు ఉండేద‌న్న‌ది నిజం. ఎందుకంటే.. టీడీపీ ఉన్న యాక్టివ్‌గా జ‌న‌సేన ఇక్క‌డ లేదు. పైగా.. స్థానికంగా టీడీపీ బ‌ల‌మే ఎక్కువ‌. పోనీ.. కూట‌మి కట్టినా.. ఆ ప్ర‌భావం ఇక్క‌డ చూపించ‌లేక పోయారు. ఆది నుంచి కూడా.. కూట‌మి బ‌లంగా ఉన్న‌ద‌న్న సంకేతాలు ఇవ్వ‌డంలోనూ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. ఫ‌లితంగా అవ‌ని గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న మార్పు చోటు చేసుకుంది. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: