ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి కనిపిస్తుంది. ప్రేక్షకులందరూ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్స్ పొందుతున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ అంచనాలకు మించి రాణిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అలాంటి టీమ్స్ లో అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఒకటి. గత కొన్ని సీజన్స్ నుంచి కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఐపీఎల్ లో టైటిల్ గెలవడం అందరని ద్రాక్ష లాగే మారిపోయింది. అయితే జట్టులో ఆటగాళ్లను మార్చిన జట్టు కెప్టెన్ ని మార్చిన అదృష్టం కలిసి రావడం లేదు. కానీ ఈసారి మాత్రం ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది కోల్కతా జట్టు.


 ఒకప్పుడు కెప్టెన్ గా కోల్కతా జట్టుకి టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ఇక ఇప్పుడు ఆ జట్టుకు మెంటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ రాకతో ఇక కోల్కతా జట్టులో ఎంతగానో దూకుడు పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది కోల్కతా జట్టు. మరి ముఖ్యంగా అటు బౌలర్ సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపించి సాహసం చేశాడు గౌతమ్ గంభీర్. చివరికి ఈ ప్లాన్ తో సక్సెస్ అయ్యాడు. ఓపెనర్ గా  బరిలోకి దిగుతున్న సునీల్ నరైన్ బ్యాటింగ్ లో సృష్టిస్తున్న విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన కోల్కతా  జట్టు ఆరు విజయాలతో పాయింట్స్ పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది   ఒకరకంగా కోల్కతా జట్టు విజయాలలో అటు ఓపెనర్లు కీలకపాత్ర వహిస్తున్నారు అని చెప్పాలి. కాక ఇలా ఈ ఐపీఎల్లో తమ జట్టు ఓపెనర్ల  ప్రదర్శన పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ కు ముందు ఓపెనర్లతో చర్చిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. లేదు ఫిలిప్ సాల్ట్ టీమ్ మీటింగ్స్ కి హాజరవుతారు. పూర్తిగా ఆటలో లీనమైపోతారు. కానీ నరైన్ అలా కాదు అతడు టీం మీటింగ్స్ కి రారు. రావద్దని నేను కూడా చెబుతాను అంటూ నవ్వేసాడు శ్రేయస్ అయ్యర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl