ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు కాగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీది గెలుపనే చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో సైతం అదే పార్టీది అధికారమని ఆ పార్టీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ మరింత పుంజుకుంది.
 
కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి బొగ్గుల దస్తగిరి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు. అటు దస్తగిరి, ఇటు సతీష్ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు ఎంతో కష్టపడుతున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఈ నేతలు ప్రధానంగా దృష్టి పెడుతుండగా ప్రచారంతో హోరెత్తిస్తూ ఓటర్ల మనస్సు గెలుచుకుంటున్నారు.
 
సర్వేలలో ఈ నియోజకవర్గంలో వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడవుతున్నా టీడీపీ గతంతో పోల్చి చూస్తే పుంజుకోవడం గమనార్హం. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గిత్తా జయసూర్య పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి దారా సుధీర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆర్థర్ 40,610 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు. ఈ ఎన్నికల్లో సైతం నందికొట్కూరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది.
 
కర్నూలు ఎస్సీ నియోజకవర్గాల్లో మరోసారి వైసీపీ సత్తా చాటడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాయలసీమ జిల్లాలలో జగన్ కు 2014 ఎన్నికల నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు జగన్ ను నమ్మిన స్థాయిలో బాబును అస్సలు నమ్మరు. అయితే కూటమి మేనిఫెస్టో ప్రజలకు మరిన్ని ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేలా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంది
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: