టిడిపి పార్టీ నిన్నటి రోజున తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.. ముఖ్యంగా బిజెపి, టిడిపి, జనసేన పార్టీ మూకుమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేస్తామంటూ గతంలో ప్రకటించారు.. అయితే నిన్నటి రోజున మేనిఫెస్టో విడిచే సమయానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే మేనిఫెస్టో రిలీజ్ చేసే వీరిద్దరూ మాత్రమే ఉండడం గమనార్హం.. పక్కన పురందేశ్వరి లేకపోవడం.. కేవలం బిజెపి నుంచి సిద్ధార్థ నాద్ సింగ్ ఇన్చార్జి ఉన్నారు.



ఇక మేనిఫెస్టోను ఇవ్వబోతూ ఉంటే అది అక్కరలేదు అని చెప్పడం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇవ్వడం ఇదంతా ఆ వేదిక పైన జరిగింది.. ఇప్పుడు ఈ వ్యవహారం మీద కాస్త కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకొని ఏపీ బీజేపీ ఎన్నికల ఇంచార్జి సిద్ధార్థ నాథ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి జాతీయస్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది.. అది గత వారమే విడుదల చేశామని.. రాష్ట్రాలలో పొత్తులో ఉన్న ఎన్డీఏ భాగస్వాముల మేనిఫెస్టో నీ విడుదల చేస్తాయని తెలిపారు.


వాటికి ఎన్డీఏ భాగస్వామిగా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అందుకే నేను హాజరయ్యాను. హాజరయ్యాను అంటే మా మద్దతు ఉన్నట్టే.. మా మేనిఫెస్టో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటు సిద్ధార్థ నాథ్ సింగ్ తెలియజేశారు. అందుకే నేను అందులో పాటిస్పేట్ చేయలేదు అంటు తెలియజేశారు. ఆ మేనిఫెస్టో వారిద్దరికీ సంబంధించిన మేనిఫెస్టో అన్నట్టుగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ విషయం మరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించినటువంటి ఆంధ్ర  బిజెపి పార్టీ ఇంచార్జ్  పురందేశ్వరి ఇటీవల సంబంధించిన బిజెపి ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ కూటమి మేనిఫెస్టోని ట్వీట్ చేయించినట్లుగా సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఉంటారా లేకపోతే మూకుమ్మడిగా ప్రచారం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: