సాధారణం గా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అయితే సెలబ్రిటీల సినిమా లైఫ్ గురించి అందరికీ అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రం చాలా తక్కువగా అందరికీ తెలుస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సెలబ్రెటీలు అన్ని విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా లో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.


  కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు చెప్పే ఆసక్తికర విషయాలు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. అయితే మిల్కీ బ్యూటీ తమన్న గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది తమన్న. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ ఒక వైపు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూనే ఇంకోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. అయితే ఇటీవలే తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది ఈ హీరోయిన్.



 ఓ హాలీవుడ్ సినిమా చూసిన తర్వాత తాను వాక్సింగ్ చేసుకోవడం మానేశాను అంటూ చెబుతుంది. హాలీవుడ్ ఫిలిం హౌస్ ఆఫ్ వ్యాక్స్ సినిమా చూసిన తర్వాత వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం)  చేయించు కోవడం మానేశాను. ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారు అన్న విషయాన్ని గుర్తు చేసింది తమన్నా. ఇకపోతే ఈ మిల్కీ బ్యూటీ హీరోయిన్గా నటించిన హరర్ కామెడీ మూవీ బాక్ మే మూడవ తేదీన విడుదల కాబోతుంది. సుందర్ దర్శకత్వం లో తెరకేక్కిన ఈ మూవీలో రాశి కన్నా మరో హీరోయిన్గా నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ మూవీతో తమన్నా హిట్ కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: