తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల పట్ల సినిమాల పట్ల ఆశక్తి ఉన్న ప్రతివ్యక్తి త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నిక అవుతాడా లేదా అన్న రకరకాల అంచనాల లెక్కలతో ఎవరి స్థాయిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో అతడు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన వార్తలు పూర్తిగా ఆగిపోయాయి.



ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ అభిమానులు కూడ మరిచిపోయిన ‘హరిహర వీరమల్లు’ టీజర్ మే 2వ తారీఖున విడుదల అవుతున్నట్లు ఈ మూవీ నిర్మాతలు ఇచ్చిన ప్రకటన చూసి చాలామంది షాక్ అవుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పవన్ క్రిష్ ల కాంబినేషన్ లో ప్రారంభం అయిన ఈ మూవీ వార్తలు విని పవన్ కెరియర్ లో ‘బాహుబలి’ రేంజ్ సినిమా అంటూ అభిమానులు ఉత్సాహ పడ్డారు.



అయితే ఈ సినిమా తరువాత పవన్ నటించిన అనేక సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఈ మూవీకి మోక్షం కలగకపోవడంతో ఈ మూవీ పై అభిమానులు కూడ ఆశలు వదులుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ టీజర్ విడుదల వెనుక ఒక వ్యూహం ఉంది అని అంటున్నారు.



పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలకు సంబంధించిన షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ అయిపోయిన తరువాత ఆగష్టు నుండి ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఏరియాల బిజినెస్ ఓటీటీ బిజినెస్ బాగా అయింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఎప్పుడో మొదలైన ‘హరిహర వీరమల్లు’ బిజినెస్ ఏమాత్రం మొదలు కాకపోవడంతో పవన్ నటిస్తున్న సినిమాలలో ఈ సినిమా కూడ ముందు వరసలో ఉంది అని బయ్యర్లకు సంకేతాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల హడావిడి మధ్య ఈ టీజర్ ను విడుదల చేస్తున్నారు అంటూ కొందరు ఇండస్ట్రి వర్గాలు అభిప్రాయ పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: