•వర్గ పోరులో టీడీపీ కి చుక్కలు
* ఈజీగా గెలవాల్సిన నియోజకవర్గంలో అలా చేసి తప్పుచేసిన బాబు..

•ఈర లక్కప్ప గెలుపు సులభం కానుందా..



(రాయలసీమ - అనంతపురం - మడకశిర - ఇండియా హెరాల్డ్)

ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో ఉన్న మడకశిర నియోజకవర్గం లో రాజకీయాలు ఉన్న ఫలంగా మారి పోయాయి. ఇక్కడ నిన్నటి వరకు కూడా సునీల్ కుమార్ కి తెలుగు దేశం పార్టీ టిక్కెట్ ఇవ్వగా నేడు ఆ స్థానంలో ఎమ్మెస్ రాజును బరిలోకి దించింది టిడిపి.. ఇక మరొకవైపు వైసీపీ తరఫున ఈర లక్కప్ప అయితే వైసీపీ తరఫున పోటీలోకి దిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు తిప్పేస్వామి వైసీపీ తరఫున 2014లో ఓడిపోయి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం మడకశిరలో వైసీపీలో వర్గ పోరు ప్రథమంగా వినిపిస్తోంది. ముఖ్యంగా నాలుగువేల ఓటర్లు ఉన్న పంచాయతీలలో కూడా రెండు వర్గాల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈర లక్కప్ప వర్గం ఒకటి కాగా.. తిప్పే స్వామి వర్గం మరొకటి..

ఇక టీడీపీ విషయానికి వస్తే.. మొదట సునీల్ కుమార్ కి అవకాశం ఇచ్చారు.. అయితే అక్కడ ఆర్థికంగా వెనుకబడి ఉన్న నేపథ్యంలో సడన్ గా ఎమ్మెస్ రాజును బరిలోకి దించడం గమనార్హం. దీంతో అట్టుడికి పోయిన సునీల్ కుమార్ వర్గం భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. అంతేకాదు టిడిపి వాళ్ళని కొట్టడమే కాకుండా ఎమ్మెస్ రాజు కారును కూడా దగ్ధం చేశారు.

ఇక గత ఎన్నికలు పోల్చుకుంటే 2009లో 10 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందగా.. 2014లో 14,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. ఇక గత ఎన్నికల్లో 13 వేల ఓట్లతో వైసిపి గెలిచిన విషయం తెలిసిందే. మరొకవైపు టిడిపిలో వర్గ పోరు ఉన్నప్పటికీ సర్దుకొని పనిచేసుకునేవారు.. సునీల్ కుమార్ విభేదాలు లేకుండా సమస్యను తీర్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరి ఇంకొకరు ఇవ్వడంతో ఆయన పూర్తిస్థాయిలో భంగపడ్డారని తెలుస్తోంది. మరొకవైపు ఎమ్మెస్ రాజు నాన్ లోకల్ అనే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. మొదట శింగనమల నియోజకవర్గం ఆశించిన ఎమ్మెస్ రాజుకి అక్కడ బండరు శ్రావణి కి టికెట్ ఇవ్వడంతో మడకశిర నియోజకవర్గాన్ని కేటాయించారు.. మడకశిర ఎస్సీ రిజర్వ్డు కావడంతో ఈయనకు టికెట్ లభించింది.

ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గ విషయానికి వస్తే.. కర్ణాటక కు చెందిన ఒక్కలిగ సామాజిక వర్గం 55 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మాధవ సామాజిక వర్గం 22 వేలకు పైగా ఓటర్లు ఉండగా , వాల్మీకి , బోయ 16 వేల ఓటర్లు ఉన్నారు. ఇక ఎస్సి ( మాల, మాదిగ , క్రిస్టియన్) సామాజిక వర్గానికి చెందినవారు.. 38 వేలకు పైగా ఓటర్లు ఉండగా.. బలిజ 6000 ఓటర్లకు పైగా ఉన్నారు. ఇక రెడ్డి 4000 ఓటర్లు.ముస్లిమ్స్ 6000 ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ మెజారిటీ ఉన్న ఓటర్లు ఒక్కలిగ.. సునీల్ కుమార్ ఈ వర్గంతో బాగానే కలగలుపుకుంటూ ఓటర్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు కానీ ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో.. పైగా టిడిపి క్యాడర్లో 70 శాతం మంది ఎమ్మెస్ రాజుకు సహకరించకపోవడం అక్కడ ఆయనకు చుక్కెదురుగా ఉంది. మరొకవైపు ఈజీగా గెలవ వలసిన ఈ నియోజకవర్గాన్ని అభ్యర్థులను మార్చి టీడీపీ తప్పు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి . ఇక ఇలాంటి విభేదాలు వైసీపీ ఈర లక్కప్పకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి మొత్తానికైతే టిడిపిలో ఉన్న వర్గ విభేదాలే వైసిపికి కలిసొస్తున్నాయని చెప్పడంలో సందేహము లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: