యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇకపోతే ఈ మూవీ షూటింగ్ తో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అయినటువంటి "వార్ 2" లో కూడా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ కూడా మరి కొంత కాలం లోనే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దేవర మొదటి భాగం , వార్ 2 మూవీ ల షూటింగ్ లు పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ , ప్రశాంతి నిల్ కాంబో మూవీ షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ కి భారీ బడ్జెట్ కానున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా దేశాల్లో జరపబోతున్నట్లు ఆ కారణంతో ఈ సినిమాకు బడ్జెట్ హెవీగా కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో "దేవర 2" మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ ఇప్పటికే తన తదుపరి మూవీ లకు సంబంధించిన అదిరిపోయే రేంజ్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: