రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు. అవసరాలకు తగ్గట్టు వారు ఏ పార్టీలోకి వెళ్తారో సమయం వస్తే కానీ తెలియదు. ఆ విధంగా ఒకప్పుడు వైసీపీలో తన హవాను కొనసాగించిన   వంగవీటి రాధాకృష్ణ ఆ తర్వాత టిడిపిలో చేరి చాలా నిస్వార్ధంగా పనిచేస్తున్నారు.ఈ తరుణంలో దెందులూరు  ప్రచార సభలో రాధాకృష్ణను టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఎలాంటి పదవులు ఆశించకుండా  పార్టీ కోసం పని చేస్తున్నారని, ఏ నియోజకవర్గానికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ తన ప్రచారాన్ని సాగిస్తున్నాడని, తన సేవలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఆ బాధ్యత నేనే తీసుకుంటానని కూడా తెలియజేశారు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ స్పీచ్ ఇచ్చారు. జగన్ పై తనదైన శైలిలో పంచులు వేశారు. అయితే వంగవీటి రాధా కృష్ణను వైసీపీ అవమానించి వెళ్ళగొట్టిన తర్వాత ఆయన లేని లోటు వారికి తెలిసి వచ్చింది.  దీంతో మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు మిథున్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, పెద్దిరెడ్డి వంటి కీలకమైన లీడర్లు చర్చలు జరిపారు. అయినా రాధాకృష్ణ మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా టిడిపిలో చంద్రబాబు వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఆయనపై ఎన్నో పుకార్లు పుట్టించినా కానీ పట్టించుకోకుండా తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు.. అయితే టిడిపి తరఫున ఆయన పోటీ చేసేందుకు చంద్రబాబు అనేక ఆఫర్లు ఇచ్చారని మచిలీపట్నం లోక్ సభ అలాగే పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అడిగారట.  

కానీ వంగవీటి రాధాకృష్ణ ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయనని డైరెక్ట్ గా చెప్పారట. ప్రస్తుతం ఆయన టిడిపి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కూటమి ప్రచారంలో పర్యటిస్తూ తనదైన స్పీచ్ లతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు తప్పకుండా ఓ కీలక పదవి కట్టబెడతానని హామీ ఇచ్చారు. ఈ విధంగా వైసిపి నుండి టిడిపి కూటమిలోకి వచ్చిన వంగవీటి రాధా కృష్ణ చంద్రబాబు కూటమికి కాస్త ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: