పార్టీ అయినా సరే తన మేనిఫెస్టో చూపించి ఓట్లడుగుతుంది. కానీ జగన్ తీరు మాత్రం ఈసారి విభిన్నంగా ఉంది. టీడీపీ మేనిఫెస్టో చూపించి ఆయన ఓట్లడుగుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. అయితే ఆయన చూపిస్తోంది తాజా మేనిఫెస్టో కాదు.. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో.. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చాడో జగన్‌ గుర్తు చేస్తున్నారు. ఆ హామీల్లో ఎన్ని అమలు చేశాడో చెప్పాలని ప్రజలనే ప్రశ్నిస్తున్నారు. అంటే.. చంద్రబాబు అనే వాడు హామీలు మాత్రమే ఇస్తాడు. అమలు చేయడు అనే విషయాన్ని జగన్ హైలెట్‌ చేస్తున్నారు.


తాను మాత్రం మాట ఇస్తే అమలు చేస్తానని.. కావాలంటే తన మేనిఫెస్టోని చెక్‌ చేసుకోండని చెబుతున్నాడు. తన మేనిఫెస్టోలో పథకాలు అమలు చేశానని భావిస్తేనే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నాడు. ఈ సారి టీడీపీ బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చింది. వందలకొద్దీ హామీలు ఇచ్చింది. జగన్ మాత్రం పెద్దగా హామీలు ఇవ్వలేదు. పాతవే కొనసాగించాడు. అందుకే టీడీపీ కొత్త మేనిఫెస్టో చూసి మోసపోవద్దని.. గతం గుర్తు చేసుకోవాలని జగన్ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: