కావాల్సిన ప‌దార్థాలు:
సోయాబీన్ పిండి - ఒక క‌ప్పు
ఉల్లిపాయ తరుగు- అర కప్పు
బ్రెడ్ క్రంబ్ పౌడర్- వంద‌ గ్రా

 

అల్లం, వెల్లుల్లి మిశ్రమం- ఒక టీ స్పూన్‌
ఆమ్‌చూర్ పొడి - అర చెంచా
అల్లం - చిన్నముక్క
గరంమసాలా- అర టీ స్పూన్‌

 

జీలకర్ర పొడి- అర  టీ స్పూన్‌
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు, కారం- రుచికి సరిపడా

 

కొత్తిమీర తరుగు- కొద్దిగా
నూనె- తగినంత 
పచ్చిమిర్చి- నాలుగు

 

త‌యారీ విధానం: ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి కాగానే అందులో ఉల్లిపాయ తరుగు , అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి మిశ్రమం వేసి కలపాలి. మిశ్రమం వేగిన తర్వాత అందులో కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పిండి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. 

 

ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిరపకాయ బజ్జీ సైజులో చేసుకొని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేసి పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ సోయా  కబాబ్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: