ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బంగాళా దుంపలు ఎంత రుచికరంగా వుంటాయో తెలుసు. వాటితో కూర చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక బంగాళా దుంపతో మనం రుచికరమైన హల్వా కూడా చేసుకోవచ్చు. ఇక బంగాళా దుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. 

 బంగాళా దుంప హల్వా కి కావాల్సిన పదార్థాలు...బంగాళాదుంపలు - ఆరు,
పాలు - ఒక కప్పు,
 నెయ్యి - అరకప్పు,
పంచదార పొడి - ఒకటిన్నర కప్పు,
జీడిపప్పులు, బాదం పప్పులు - రెండు కలిపి గుప్పెడు, యాలకుల పొడి - ఒక టీస్పూను

బంగాళా దుంప హల్వా తయారు చేయు విధానం...

ముందుగా బంగాళాదుంపలను బాగా కడిగి పైన తొక్క తీసేయాలి. తరువాత వాటిని సన్నగా తరగాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. బంగాళాదుంపలను వేసి వేయించుకోవాలి. మంటలో సిమ్ లో పెట్టి తరుగును బాగా వేయించాలి. తరుగు మాడకుండా... ఎంత బాగా వేగితే అంత మంచి టేస్టు వస్తుంది. తరుగు బాగా వేగాక పాలు, పంచదార వేసి కలపాలి. ఆ మొత్తాన్ని బాగా ఉడికించాలి. కాస్త మెత్తటి ముద్దలాగా అవుతుంది మిశ్రమం. చూడడానికి హల్వాలా చిక్కబడుతున్నప్పుడు వేయించిన బాదం, జీడిపప్పు, యాలకులపొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. బంగాళాదుంప హల్వా ముక్కలు తినడానికి సిద్ధం.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: