పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019లో ప్రేమించిన పెళ్లి చేసుకున్న ఓ జంట బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే వారిలో భర్త ఉద్యోగం లాక్‌డౌన్ కారణంగా పోయింది. ఆ తరువాత కొద్దిరోజుల పాటు అతడు ఇతర ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కొన్ని రోజుల తరువాత అతడికి డబ్బులు రావడం మొదలయ్యాయి.
ఇక అతడికి డబ్బులు మాత్రమే కాదు.. వ్యవహారశైలిలోనూ మార్పు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన అతడి భార్య.. భర్తలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటనే దానిపై ఆరా తీసింది. అతడి ఫోన్ తీసుకుని అందులో ఏమైనా తనకు పనికొచ్చే సమాచారం దొరుకుతుందేమో అని వెతికింది. అయితే అతడి ఫోన్ లాక్ చేసి ఉండటంతో.. తన సోదరుడి సాయంతో ఆ ఫోన్ లాక్ తీయించింది. భర్త ఫోన్‌లోని ఫోటోలు చూసిన భార్యకు మైండ్ బ్లాక్ అయ్యింది. కొందరు మహిళల ఫోటోలు అందులో ఉన్నాయి. ఇక అతడు మగ వేశ్యగా మారాడానే విషయం ఆమెకు అర్థమైంది. మొదట ఈ విషయాన్ని అతడు అంగీకరించలేదు.
చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అతడు వాస్తవం ఒప్పుకున్నాడు. తన భర్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసమే తాను ఈ వృత్తిలోకి వచ్చానని అన్నాడు. ఒక్కో కస్టమర్ నుంచి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటానని వెల్లడించాడు. తాను ఈ వృత్తిని మానుకోలేనని.. అయినా భార్యతో కలిసి ఉంటానని అన్నాడు. అయితే ఇందుకు భార్య అంగీకరించకపోవడంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి